Skip to main content

Namaste NRI

నవంబర్‌ 15న సంచలన ప్రకటన

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మూడోసారి బరిలో దిగేందుకు మాజీ అధ్యక్షుడు,  రిపబ్లికన్‌ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్యంతర ఎన్నికల చివరి ప్రచార సభలో మాట్లాడారు. ఫ్లోరిడాలోని మార్‌`ఏ`లాగో రిసార్ట్‌లో  నవంబర్‌ 15న సంచలన విషయాన్ని వెల్లడిరచబోతున్నాను అని  ఓహియో రాష్ట్రంలోని వాండలియా సిటీలో పార్టీ మద్దతుదారులనుద్దేశిస్తూ ప్రసంగించారు. తాను తప్పకుండా మూడోసారి పోటీకి దిగుతానని మియామీలో జరిగిన బహిరంగ సభలో వ్యాఖ్యానించారు.

          అయితే మధ్యంతర ఎన్నికలు ముగిసేదాకా ఆగాలని, ఆ తర్వాతే అధ్యక్ష ఎన్నికలపై మాట్లాడాలని రిపబ్లికన్‌ సీనియర్‌ నేతలు, ఆయన సన్నిహితులు ట్రంప్‌కు సలహాలు ఇస్తున్నారు. ముందే అధ్యక్ష అభ్యర్థిత్వంపై వ్యాఖ్యానాలు చేస్తే మధ్యంతర ఎన్నికలు ట్రంప్‌ అభ్యర్థిత్వానికి రెఫరెండమ్‌గా మారే ప్రమాదముందని ట్రంప్‌కు హితవు పలికారు. అయినా సరే ట్రంప్‌ పలు మధ్యంతర ఎన్నికల ప్రచార సభల్లో తన అధ్యక్ష అభ్యర్థిత్వంపై వ్యాఖ్యానాలు చేస్తుండటం గమనార్హం.

Social Share Spread Message

Latest News