రష్యాతో యుద్ధం ముగించేందుకు ఎటువంటి చర్చలు జరిపే అవకాశమే లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పష్టం చేశారు. జీ20 శిఖరాగ్ర సదస్సుకు ఆయన వీడియో సమావేశంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా జెలెన్ స్కీ మిన్స్క్3 ఒప్పందాన్ని కూడా తోసిపుచ్చారు. రష్యా ఒప్పందం అంటూనే దాన్ని ఉల్లంఘిస్తోంది. రష్యా బలగాలు ఉక్రెయిన్లో భీభత్సం సృష్టించాయి. ఎన్ని విధాలుగా చెప్పినా రష్యా పెడచెవిన పెట్టింది. అందుకే తాము రష్యాతో చర్చలకు సిద్ధంగా లేము అంటూ జెలన్స్కీ స్పష్టం చేశారు.














