Skip to main content

Namaste NRI

ఏపి ఏపీ04 రామాపురం ట్రైలర్‌ విడుదల 

రామ్‌ జాక్కల, అఖిల ఆకర్షణ, పి.యన్‌.రాజ్‌, సునీల్‌ మల్లెం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఏపీ04 రామాపురం. హెమా రెడ్డి తెరకెక్కించారు. రామ్‌ రెడ్డి అందూరి నిర్మించారు.  ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.  ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు హేమ రెడ్డి మాట్లాడుతూ  19 ఏళ్ల వయసులో ఈ చిత్ర కథ రాయడం మొదలు పెట్టాను. 23 ఏళ్లకు తెరపైకి తీసుకొచ్చాను. చిత్ర పరిశ్రమలో ప్రోత్సాహం ఉండదంటారు. కానీ ఈ చిత్రం కోసం  ఇంత మంది వచ్చి అండగా నిలబడ్డారు. అందరికీ ధన్యవాదాలు అన్నారు.  నిర్మాత మాట్లాడుతూ మంచి కథతో తక్కువ బడ్జెట్‌లోనే సినిమా చక్కగా చేశాం మా ప్రయత్నం  విజయ వంతం చేయాలని కోరుతున్నా అన్నారు. ఈ వేడుకకు సోహెల్‌, జెస్సీ, పృథ్వి రాజ్‌, నందు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  ఈ సినిమా డిసెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ చిత్రానికి సంగీతం: సాకేత్‌ వేగి,  అబు, ఛాయాగ్రహణం :  మల్లి కె.చంద్ర, వినయ్‌ కుమార్‌ జంబరపు. 

Social Share Spread Message

Latest News