Skip to main content

Namaste NRI

మానవ చరిత్రలో ఇదే  కీలక ఘట్టం .. బిల్‌ నెల్సన్‌  

1969లో నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌  చంద్రుడిపై కాలుమోపడం మానవ చరిత్రలో కీలక ఘట్టం అని  అమెరికా మాజీ వ్యోమగామి బిల్‌ నెల్సన్‌ అన్నారు. ఈ సందర్భంగా బిల్‌ నెల్సన్‌  మాట్లాడుతూ  దీని ద్వారా అంతరిక్ష పోటీలో అమెరికా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇప్పుడు మళ్లీ కొత్తగా స్పేస్‌ రేస్‌ మొదలైనట్టు కనిపిస్తున్నది. ఇప్పటికే ఇతర దేశాల భూభాగాలు తమవిగా పేర్కొంటున్న డ్రాగన్‌ దేశం, చందమామ విషయంలోనూ ఇదే తరహాలో వ్యవహరించొచ్చని, అక్కడి భూభాగం తమదేనంటూ వాదించొచ్చని ప్రపంచ దేశాలను హెచ్చరించారు. ‘శాస్త్ర పరిశోధనల ముసుగులో వాళ్లు చంద్రుడిపై స్థలాన్ని పొందకుండా మనం చూడాలి’ అని నెల్సన్‌ అన్నారు. 2030లోగా చంద్రుడిపైకి వ్యోమగాములను పంపుతామని చైనా ప్రకటించిన తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు.

Social Share Spread Message

Latest News