Namaste NRI

మహాశివరాత్రికి వినరో భాగ్యము విష్ణుకథ

కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణుకథ. కశ్మీరా కథానాయికగా నటిస్తుంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. తిరుపతిలో ఈ చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. నాల్గవ సింగిల్ సోల్ ఆఫ్ తిరుపతి అనే పాటను విడుదల చేశారు. ఈ వేడుకలో పన్నెండు తరాలకు చెందిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారసులను సన్మానించారు. కథానుగుణంగా ఈ చిత్రాన్ని ఎక్కువ భాగం తిరుపతిలోనే చిత్రీకరించాం. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన లభిస్తున్నది. చక్కటి కుటుంబ కథా చిత్రమిది. ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా  అందరిని మెప్పిస్తుంది అని చిత్రబృందం పేర్కొంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.  సెన్సార్ సభ్యుల మన్ననలు పొంది U/A  సర్టిఫికెట్ ను సాధించుకుంది.  అయితే ముందుగా సినిమాని ఈ నెల 17న విడుదల చేయాలనుకున్నారు. కానీ తాజాగా ఒక్క రోజు ఆలస్యంగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాని ఈ నెల 18న  విడుదల చేస్తున్నట్టు యూనిట్ తాజాగా ప్రకటించింది. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాని థియేటర్లోకి తీసుకురాబోతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: డేనియల్ విశ్వాస్, సంగీతం: చైతన్ భరద్వాజ్, దర్శకత్వం: మురళీ కిషోర్ అబ్బూరు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events