Skip to main content

Namaste NRI

మా మధ్య అలాంటి ఒప్పందమేమీ లేదు

కియారా అద్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఇటీవలే మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ కొత్త జంట కలిసి నటించబోయే సినిమాల గురించి ఇప్పుడు ఇంకాస్త క్రేజ్ పెరిగింది. ఈ క్రేజ్‌ను  క్యాష్ చేసుకునేందుకు దర్శక నిర్మాత కరణ్ జోహార్ వీరితో మూడు చిత్రాలకు ఒప్పందం కుదుర్చుకున్నాడనే వార్త ఇటీవల ప్రచారంలోకి వచ్చింది. తాజాగా ఈ విషయంపై స్పందించారు కరణ్ జోహార్. కియారా, సిద్ధార్థ్తో తమ నిర్మాణ సంస్థ అలాంటి ఒప్పందమేదీ చేసుకోలేదని వెల్లడించారు. కరణ్ స్పందిస్తూ  కియారా, సిద్ధార్థ్ నాకు సన్నిహితులు. నేను కోరిన సినిమాలో వాళ్లు నటించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అందుకోసం ముందస్తు ఒప్పందాలు చేసుకోవడం అవసరం లేదు. మా మధ్య ఒప్పందాలు, పారితోషికాలు అనేవి చర్చకు రావు అని చెప్పారు. రెండేండ్ల క్రితం కరణ్ జోహార్ నిర్మించిన షేర్షా  చిత్రంలో కియారా, సిద్ధార్థ్ హీరో హీరోయిన్లుగా నటించారు.

Social Share Spread Message

Latest News