Namaste NRI

ఈ సినిమా కూడా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ : నాగార్జున 

అఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా  నటించి సినిమా ఏజెంట్‌. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. వరంగల్‌లో  ఏజెంట్‌  ప్రీరిలీజ్‌ వేడుకకు అక్కినేని నాగార్జున  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున  మాట్లాడుతూ  వరంగల్‌ పోరాటాలకు అడ్డా. వీరత్వానికి ఇంటిపేరు. ఇక్కడ ఈ వేడుక జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. కొత్త కథాంశంతో సినిమాలు తీస్తే ప్రేక్షకులు తప్పకుండా విజయాన్ని అందిస్తారు. ఇదొక స్పై థ్రిల్లర్‌. ఈ కథ గురించి నాకు తెలియదు. కానీ అఖిల్‌ సినిమా గురించి చెబుతుంటే తప్పకుండా పెద్ద హిట్‌ అవుతుందనిపించింది. ఈ సినిమా కోసం అఖిల్‌ చాలా కష్టపడ్డాడు.    ఈ సినిమా కూడా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుందనుకుంటున్నా అన్నారు.

 

మంత్రి దయాకర్‌ రావు మాట్లాడుతూ వరంగల్‌లో వేడుక జరుపుకునే ప్రతి సినిమా విజయం సాధిస్తుంది. వరంగల్‌ విజయాలకు అడ్డా. నాగార్జునగారిని వరంగల్‌లో స్టూడియో పెట్టాలని కోరుతున్నా అన్నారు. ఈ చిత్రం నటుడిగా తనకు ధైర్యాన్నిచ్చిందని, విజయంపై ధీమాగా ఉన్నామని హీరో అక్కినేని అఖిల్‌ చెప్పారు. దర్శకుడు సురేందర్‌ రెడ్డి మాట్లాడుతూ ఈ సినిమా కోసం అఖిల్‌ ఎంతగానో శ్రమించాడు. అతనిలో ఏదో సాధించాలనే తపన కనిపించింది. అఖిల్‌ కోసమే ఈ సినిమా చేశా అన్నారు. నాగార్జునతో సినిమా చేయాలన్నది మా కల. అది అఖిల్‌తో నెరవేరింది. ఈ వేడుకకు నాగార్జునగారు అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉంది అని నిర్మాత అనిల్‌ సుంకర చెప్పారు. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ కార్యక్రమంలో  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, నగర మేయర్‌ గుండు సుధారాణి, ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events