Namaste NRI

మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి టీజర్ వచ్చేసింది

నవీన్‌ హీరోగా నటించి సినిమా  మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి.  యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాకు పి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో అనుష్క చెఫ్ గా నటిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైపే ఉంది. పైగా దానికి తోడు చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్లు విశేషంగా ఆకట్టుకున్నాయి.  కాగా తాజాగా మేకర్స్‌ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు. టీజర్‌తోనే సినిమాపై కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మేకర్స్‌. ఒక చెఫ్‌కు, స్టాండప్‌ కమెడియన్‌కు మధ్య సాగే కథ ఇదని ముందు నుంచి మేకర్స్‌ చెప్పుకుంటూనే వస్తున్నారు. ఇక టీజర్‌లో కూడా అదే చూపించారు. అయితే జీవితంలో పెళ్లి వద్దనుకునే అనుష్క, నవీన్‌తో ఎలా ప్రేమలో పడింది? వాళ్ల ప్రేమ పెళ్ళి వరకు సాగుతుందా? స్టాండప్‌ కమెడియన్‌గా రాణించాలనుకునే నవీన్‌ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది ఇలా ఎన్నో అంశాలకు ఈ టీజర్‌ తెరలేపింది.

అయితే టీజర్‌ మాత్రం కొత్తగా అనిపిస్తుంది. చాలా కాలం తర్వాత మంచి లవ్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా చూస్తున్నామనే ఫీల్‌ను కలిగిస్తుంది. ముఖ్యంగా నవీన్‌ కామెడీ టైమింగ్‌ తెగ ఆకట్టుకుంటుంది. ఇక ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే సీన్స్‌ సినిమాలో పుష్కలంగా ఉన్నట్లు టీజర్‌తో స్పష్టం అయింది. యూవీ సంస్థ కూడా ఈ సినిమాను చాలా రిచ్‌గా తీసినట్లు విజువల్స్‌ చూస్తే తెలుస్తుంది. షూటింగ్‌ చివరి దశలో ఉన్న ఈ సినిమాను ఇదే ఏడాది ద్వితియార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events