రక్షిత్ హీరోగా నటిస్తున్న చిత్రం నరకాసుర.సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి సెబాస్టియన్ దర్శకత్వం వహిస్తున్నారు. డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించారు. ఈ సినిమాలో సంగీర్తన, అపర్ణ హీరోయిన్లుగా నటిస్తుంది.ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ విడుదల చేశారు. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీపై టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేసింది. దర్శకుడు సెబాస్టియన్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఈ సినిమా కోసం టీమ్ అంతా రెండేండ్లు శ్రమించాం. ఓ విభిన్నమై కథతో తెరకెక్కించాం. జబల్పూర్లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన సన్నివేశాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి అన్నారు. తన కెరీకు బ్రేక్‌నిచ్చే చిత్రమవుతుందని హీరో రక్షిత్ తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ కథానుగుణంగా చక్కటి ఆర్టిస్టులు కుదిరారు. మా సంస్థకు పేరు తెచ్చే చిత్రమవుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. తెలుగులతో పాటు హిందీ, తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.

















