Skip to main content

Namaste NRI

 జైలర్ నుంచి మరో అప్‌డేట్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ తాజా చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్‌ తెరకెక్కిస్తున్నారు.  ఈ  చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు. యాక్షన్‌ కామెడీ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్‌, టాలీవుడ్ యాక్టర్‌ సునీల్‌, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ముందుగా అందించిన న్యూస్ ప్రకారం జైలర్‌ క్రేజీ అప్‌డేట్‌ ఏంటో చెప్పేశారు. అంతా అనుకున్నట్టుగా జైలర్ రిలీజ్‌ టైం గురించి రివీల్ చేశారు మేకర్స్‌.

జైలర్‌గా రజినీకాంత్‌ ఆగస్టు 10న వేట మొదలు పెట్టనున్నట్టు తెలియజేస్తూ వీడియో రిలీజ్ చేశారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్‌, రమ్యకృష్ణ, యోగిబాబు, వసంత్‌ రవి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జైలర్‌ నుంచి ఇప్పటికే విడుదలైన మోహన్‌ లాల్‌, సునీల్‌, తమన్నా పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. 

Social Share Spread Message

Latest News