టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా ఖుషి. శివనిర్వాణ దర్శకత్వం. ఈ చిత్రంలో సమంత ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సచిన్ ఖడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కన్నడ యాక్టర్ జయరాం, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఖుషి నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ, సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.ఖుషి నువ్ కనబడితే.. ఖుషి నీ మాట వినబడితే.. అంటూ సాగే ట్యూన్తో మ్యూజిక్ డైరెక్టర్ హేశమ్ అబ్ధుల్ వహబ్ టీం మ్యూజికల్ అప్డేట్ అందించిన విషయం తెలిసిందే.


తాజాగా ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే అప్డేట్ షేర్ చేశారు. ఈ నెల 9న విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా పాటను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సాంగ్ ఫీల్ గుడ్ ట్రీట్ అందించబోతున్నట్టు తాజా లుక్తో అర్థమవుతోంది. ఖుషి చిత్రాన్ని సెప్టెంబర్ 1న సినిమా విడుదల చేస్తున్నారు.















