అమెరికాకు చెందిన ప్రొడక్ట్ ఇంజినీరింగ్ అండ్ సొల్యూషన్స్ కంపెనీ జాప్‌కామ్ గ్రూపు హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని తెలిపారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన భేటీలో జాప్‌కామ్ వ్యవస్థాపకుడు, సీఈవో కిషోర్ పల్లమ్‌రెడ్డితో మంత్రి కేటీఆర్ చర్చించారు. ట్రావెల్, హాస్పిటాలిటీ, ఫిన్‌టెక్, రిటేల్ రంగాల్లో కీలకమైన ఏఐ, ఎన్ఎల్‌పీ ఉత్పత్తులను జాప్‌కామ్ కంపెనీ రూపొందించనున్నది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న జాప్‌కామ్ కంపెనీ తొలుత 500 మందికి ఉద్యోగాలు కల్పించనున్నది. ఆ తర్వాత ఏడాదిలోగా మరో వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

















