ఐక్యరాజ్యసమితి మాజీ అంబాసిడర్, దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హెలీతో . తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ భేటి అయ్యారు. అమెరికా టూర్‌లో ఉన్న ఆయన వివిధ వ్యూహాత్మక అంశాలపై చర్చించారు. అమెరికా, ఇండియా సంబంధాల నేపథ్యంలో హైదరాబాద్, తెలంగాణ ప్రాముఖ్యత గురించి హెలీతో మంత్రి కేటీఆర్ ముచ్చటించారు. ఆర్థిక వ్యవస్థ, ఎన్నికలు, రాజకీయాల గురించి నిక్కీ హెలీతో విస్తృత స్థాయిలో అభిప్రాయాలను పంచుకున్నట్లు మంత్రి తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో పోటీపడుతన్న నేపథ్యంలో నిక్కీకి మంత్రి కేటీఆర్ బెస్ట్ విషెస్ తెలిపారు.

















