Skip to main content

Namaste NRI

భవిష్యత్తులో మరో మహమ్మారి

 కరోనా కంటే ప్రాణాంతకమైన మహమ్మారి భవిష్యత్తులో రావచ్చని, ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ హెచ్చరించారు. జెనీవాలో జరిగిన వార్షిక ఆరోగ్య సదస్సులో మాట్లాడుతూ భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను నివారించడానికి వెంటనే చర్చలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ శతాబ్దంలోనే అతి పెద్ద ఆరోగ్య సంక్షోభాన్ని సృష్టించిన కరోనా మహమ్మారి ఊహించని విధంగా వచ్చిందని, దానిని ఎదుర్కొనేందుకు ప్రపంచం అప్పటికి సిద్ధంగా లేకపోవడం వల్ల నష్టం ఎక్కువగా జరిగిందన్నారు. కొత్త కరోనా వేరియంట్‌ వచ్చే ముప్పు పొంచి ఉన్నదని, కేసులు, మరణాల పెరుగుదలకు ఇది కారణం కావచ్చని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News