బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ చిత్రానికి భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్‌చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీష్ శంకర్ క్లాప్‌నివ్వగా, పరశురామ్ కెమెరా స్విఛాన్ చేశారు. సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. బెల్లంకొండ శ్రీనివాస్ పాత్ర గత చిత్రాల కంటే భిన్నంగా ఉంటుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంటుంది. ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ఇతర వివరాలను వెల్లడిస్తాం. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను జూన్ రెండో వారం నుంచి మొదలుపెట్టనున్నట్టు చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: జిమ్షి ఖలీద్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: హరీష్ కట్టా, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట, రచన-దర్శకత్వం: సాగర్ కె చంద్ర.

















