నాటో సభ్యత్వం పై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశాడు. నాటో మెంబర్షిప్ విషయమై జూలై కల్లా స్పష్టమైన ప్రకటనను కీవ్ కోరుకుంటుందని ఆయన అన్నాడు. యూరోపియన్ యూనియన్లో ఉక్రెయిన్ చేరికపై కూడా పురోగతి ఆశిస్తున్నటు జెలెన్స్కీ వెల్లడించాడు. ఇది నిర్ణయాలు తీసుకోవాల్సిన సంవత్సరం. జూలై నెలలో మాల్డోవాలో జరగనున్న నాటో సమావేశంలో ఉక్రెయిన్ సభ్యత్వం గురించి స్పష్టమైన, సానుకూలమైన నిర్ణయం వెలువరించాలి. అంతేకాదు రష్యాతో యుద్ధాన్ని ముగించడానికి మేము శాంతి సమావేశం కోసం సన్నద్ధమవుతున్నాం. దానివల్ల ప్రపంచమంతా శాంతి సందేశాన్ని(సూత్రాన్ని) ఆచరణలోకి తెచ్చేలా చేస్తుంది అని జెలెన్స్కీ తెలిపాడు. నాటో సమావేశంలో 40 యూరోపియన్ దేశాల ప్రతినిధులు పొల్గొననున్నారు. అయితే ఉక్రెయిన్ కోరుతున్న శాంతి సమావేశం నిర్వహణపై నాటో ఇంతవరకు నిర్ణయం వెల్లడించలేదు.

















