Skip to main content

Namaste NRI

పదిరోజుల పాటు ఘనంగా దశాబ్ది వేడుకలు :  కాసర్ల నాగేందర్ రెడ్డి

మెల్‌బోర్న్‌ లో  తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యాన బీఆర్‌ఎస్‌ యూత్ వింగ్ కన్వీనర్ వినయ్ గౌడ్, ఉదయ్ రెడ్డి నాయకత్వంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ పిలుపు మేరకు దశాబ్ది వేడుకలను పదిరోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్‌, కాన్బెర్ర, అడిలైడ్, బ్రిస్బేన్, జీలాంగ్, బల్లారాట్, పెర్త్, గోల్డ్ కోస్ట్, హోబర్ట్, డార్విన్ నగరాలలో వేడుకలు జరిపి తెలంగాణ కీర్తిని , తెలంగాణలో చేపట్టిన అభివృద్ధిని ఎన్ఆర్ఐలకు వివరిస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో సాయిరాం ఉప్పు, విక్రమ్ కందుల, సంజీవ్ రెడ్డి, శన్ముఖ్, వేణు, సాయి గుప్తా, రాకేష్,అరుణ్, నరేందర్, హరి పల్ల, విజయ్ , డాక్టర్‌ అర్జున్,  విశ్వామిత్ర, సునిల్, సతీష్, ప్రవీణ్, అమిత్ , సురేష్, వినోద్, చైతన్య, సూర్య రావు , తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News