Namaste NRI

బహ్రెయిన్‌లో ఎన్నారై బీఆర్ఎస్ సెల్ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ది వేడుక‌లు

బహ్రెయిన్‌లో ఎన్నారై బీఆర్ఎస్ సెల్ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ది వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఎన్నారై బీఆర్ఎస్ సెల్ ఉపాధ్యక్షులు వెంకటేష్ బొలిశెట్టి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ముందుగా అమరవీరులను స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కేకును కట్ చేసి ఆనందోత్సాలతో తెలంగాణా రాష్ట్ర అవ‌త‌ర‌ణ ద‌శాబ్ది వేడుకలు ఘనంగా నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ సెల్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ మాట్లాడుతూ  బహ్రెయిన్‌లో తెలంగాణ‌ రాష్ట్ర ఆవతరణ దినోత్సవాలు  జరుపుకుంటున్నందుకు చాల సంతోషంగా వుంద‌న్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అసువులు బాసిన ఎందరో మహనీయుల త్యాగఫలం, కేసీఆర్ సారథ్యంతో, ప్రత్యేక తెలంగాణ‌ రాష్ట్రం ఏర్పడింది.స్వరాష్ట్రం సిద్ధించాక తొమ్మిదేండ్లలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉన్నదని, ఇదంతా సీఎం కేసీఆర్‌ వల్లే సాధ్యమైందని అన్నారు. తెలంగాణ వ‌చ్చిన నాటి నుంచి ఇప్పటి వ‌ర‌కు అభివృద్ధిలో దేశంలోనే నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ముందున్నాం అని తెలిపారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అందిస్తున్న పథకాలు, చేస్తున్న అభివృద్ధిని దేశ ప్రజలు గమనిస్తున్నారని, వారు కూడా కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ విజయం ఖాయమని, మూడోసారి కూడా కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. 

ఈ కార్యక్రమములో ఎన్నారై బీఆర్ఎస్‌ సెల్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు వెంకటేష్ బొలిశెట్టి, ప్రధాన కార్యదర్శి పుప్పాల బద్రి, మగ్గిడి రాజేందర్, అన్నారం సుమన్, కార్యదర్శులు సంగేపోలు దేవన్న, ఉత్కం కిరణ్ గౌడ్, కొత్తూరు సాయన్న, బొలిశెట్టి ప్రమోద్, చంద్రశేఖర్, కాశిమ్, రవి కుమార్ ,అన్నారం శ్రీ కుమార్ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events