Namaste NRI

గుంటూరు కారం నెక్స్ట్​ షెడ్యూల్​ రెడీ

స్టార్‌ హీరో మహేష్‌ బాబు శరవేగంగా తన కొత్త సినిమా గుంటూరు కారం షూటింగ్‌ పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు.  పూజా హెగ్డే, శ్రీలీల నాయికలు . ఈ సినిమాకు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. హారికా హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ నెల రెండో వారం నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్‌కు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ భారీ షెడ్యూల్‌తో సినిమాలోని కీలక ఘట్టాల్ని పూర్తి చేస్తారని తెలుస్తున్నది. ఇన్నాళ్లు మందకొడిగా సాగిన చిత్రీకరణ ఇటీవల వేగం పుంజుకుంది. దివంగత సూపర్‌స్టార్‌ కృష్ణ జయంతికి విడుదల చేసిన టైటిల్‌, గ్లింప్స్‌కు వచ్చిన ఆదరణ చిత్రబృందంలో సంతోషాన్ని నింపింది. ఇదే ఉత్సాహంలో సినిమాను ఆకట్టుకునేలా రూపొందించాలని టీమ్‌ భావిస్తున్నదట. వచ్చే సంక్రాంతికి జనవరి 13న గుంటూరు కారం సినిమాను విడుదల చేయబోతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events