Namaste NRI

మైసూర్ లో.. శ్రీలీల‌తో హీరో రామ్

రామ్‌ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీలీల నాయికగా నటిస్తున్నది. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్‌ మైసూర్‌లో ప్రారంభమైంది. ఈ నెల 15 వరకు జరగనున్న ఈ షెడ్యూల్‌లో యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటు ఓ పాటను చిత్రీకరించబోతున్నారు. ఈ షెడ్యూల్‌తో దాదాపు షూటింగ్‌ పూర్తవుతుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమాలో రామ్ తండ్రి పాత్రని బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ పోషించనున్నార‌ట‌. ఈ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ దృశ్యాలను ఇటీవలే చిత్రీకరించారు.అందుకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను 24 రోజుల పాటు చిత్రీకరించినట్టు రామ్ చెప్పారు. ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో దసరాకి విడుదల చేయనున్నారు.    ఈ చిత్రానికి కెమెరా: సంతోష్‌ డిటాకే, సంగీతం: తమన్‌, రచన-దర్శకత్వం: బోయపాటి శ్రీను.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events