Namaste NRI

అమెరికా  నిబంధనలను అనుమతించం : రష్యా

 అమెరికా దాష్టీకాన్ని, గుత్తాధిపత్యాన్ని, నియమ, నిబంధనలను రష్యా ఎన్నటికీ ఆమోదించదని రష్యా విదేశాంగ మంత్రి లావ్‌రోవ్‌ స్పష్టం చేశారు. సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలిన తర్వాత కొంతకాలం పాటు సాగిన గందరగోళం, అస్తవ్యస్థ పరిస్థితుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా రష్యా దౌత్య బృందాలు తమ కార్యకలాపాలను ఉధృతం చేశాయని, ఇతర దేశాలతో సంబంధాలు పెంచుకున్నాయని చెప్పారు. గత కొన్నేళ్లలో ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాలతో సంబంధాలు పెరిగాయన్నారు. వాషింగ్టన్‌ బలవంతంగా రుద్దే నిబంధనలు వేటినీ ఆమోదించరాదన్న కృత నిశ్చయం తమలో బలపడిందన్నారు.

అమెరికా పాత్ర, ప్రభావం నెమ్మదిగా తగ్గుముఖం పడుతోందని, నెమ్మదిగానైనా కచ్చితంగా క్షీణించడం తప్పదన్నారు. రష్యాను లక్ష్యంగా చేసుకుని ఎన్ని ఆంక్షలు విధించినా, ఏకాకిని చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటన్నింటినీ రష్యా ప్రతిఘటించడంలో ముందుందని చెప్పారు. వాస్తవానికి, రష్యాను అంతర్జాతీయ సమాజం నుండి వేరు చేయడానికి ప్రయత్నించి వారు విఫలమ య్యారని లావ్‌రోవ్‌ పేర్కొన్నారు. ప్రపంచంలో కొన్ని ప్రాంతాలను అస్థిరం చేయాలన్నది అమెరికా లక్ష్యమని, భద్రత అందిస్తున్నామనే సాకుతో, తీవ్రవాదంపై పోరు పేరుతో ఇటువంటి చర్యలకు పాల్పడుతూ వుంటుందని విమర్శించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events