Namaste NRI

పశ్చిమదేశాలు ఈ చర్యకు పాల్పడ్డాయి : రష్యా

ఉక్రెయిన్‌, పశ్చిమ దేశాల తప్పుడు ప్రచారాన్ని ఐరాసలో రష్యా శాశ్వత ప్రతినిధి వాసిలీ నెబెంజియా ఖండించారు. ఉక్రెయిన్‌లోని కఖోవ్కా జల విద్యుత్‌ కేంద్రంపై కీవ్‌ ఆర్మీ దళాల దాడిని ఆయన విమర్శించారు. న్యూయార్క్‌లో జరిగిన ఐరాస భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి) ప్రత్యేక సమావేశంలో రష్యా శాశ్వత ప్రతినిధి వాసిలీ నెబెంజియా పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ తన అధికార వ్యూహాలుగా పేర్కొనే ఉగ్రవాద విధానాలను బహిరంగంగానే ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు.

ఉక్రెయిన్‌, దానికి సాయం అందించిన పశ్చిమదేశాలు ఈ చర్యకు పాల్పడ్డాయని, ఇది యుద్ధ నేరంగా పరిగణించే విధ్వంసక చర్య అని అన్నారు. సాయుధ దళాలను తిరిగి సమూహపరిచేందుకు వీలుగా ఉక్రెయిన్‌ ఈ విధ్వంసక చర్యల ద్వారా అనుకూల పరిస్థితులను సృష్టించుకునేందుకు యత్నిస్తోందని అన్నారు. ఈ విధ్వంసం ప్రణాళిక ప్రకారం జరిగిందని, ఉక్రెయిన్‌ భూభాగానికి, జనాభాకు అధిక నష్టాన్ని కలిగించాలన్న లక్ష్యంతోనే దాడి జరిగిందని అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events