Skip to main content

Namaste NRI

27 ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం.. భారత్ తరుపున సినీ షెట్టి

27 ఏళ్ల త‌ర్వాత 2023లో మిస్ వరల్డ్ పోటీలకు  ఇండియా అతిథ్యం ఇవ్వనుంది. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అందాల పోటీ తేదీలు ఖరారు కాకున్నా మిస్ వరల్డ్ 71వ ఎడిషన్ నవంబర్ లో జరుగుతుందని స‌మాచారం. ఫెమినా మిస్ ఇండియా 2022 టైటిల్ విజేతగా నిలిచిన సినీ షెట్టి ఈ సారి భారత్ లో నిర్వహించబోతున్న మిస్ వరల్డ్ పోటీలో భారత్ తరుపున ప్రాతినిథ్యం వహించబోతోంది. భార‌త్ లో ఈ పోటీలు జ‌ర‌గ‌నున్న‌నేప‌థ్యంలో ప్రపంచవ్యాప్తంగా తన తోటి సోదరీమణులను భారత్ కు ఆహ్వనిస్తున్నానని, భారత అంటే ఏమిటో, భారత్ లో వైవిధ్యాన్ని చూపించేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నానని సినీ షెట్టి పేర్కొంది. ఇండియాలో మీరు గడిపే సమయం బాగుంటుందని , అంద‌రూ వ‌చ్చి మా అతిధ్యం స్వీక‌రించాల‌ని ఆహ్వానం ప‌లికింది.

కర్ణాటక మూలాలు ఉన్న సినీ షెట్టి ముంబైలో పుట్టింది. అందుకే మిస్ ఇండియా 2022 పోటీలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించి మిస్ ఇండియా టైటిల్ ను ద‌క్కించుకుంది. సినీ శెట్టి అకౌంటింగ్ మరియు ఫైనాన్స్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ చదివారు. ప్ర‌స్తుతం ఆమె మార్కెటింగ్ సంస్థలో పనిచేస్తున్నారు.

Social Share Spread Message

Latest News