Skip to main content

Namaste NRI

1920 ట్రైలర్ చూసి.. నిజంగా భయపడ్డాను :  నాగార్జున

అవికా గోర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్. కృష్ణ భట్ దర్శకత్వం వహించారు. సీనియర్ దర్శకుడు మహేష్భట్ కథనందించారు. విక్రమ్ భట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్ర ట్రైలర్ను అగ్ర హీరో అక్కినేని నాగార్జున ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత మహేష్భట్గారిని కలుసుకున్నా. ఆయన నాకు గురువులాంటివారు. స్ఫూర్తినిచ్చే వ్యక్తి. ఆయనతో సినిమా చేసిన జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయి. 1920 ట్రైలర్ చూస్తూ నిజంగా భయపడ్డాను. ఇలాంటి సినిమాలను పెద్ద స్క్రీన్లోనే చూడాలి. హారర్ సినిమాలు చూస్తున్నప్పుడు వచ్చే కిక్కే వేరు అన్నారు.

ఇది కేవలం హరర్ చిత్రమే కాదని, విలువల గురించి కూడా చర్చించామని మహేష్భట్ పేర్కొన్నారు. కృష్ణ భట్ మాట్లాడుతూ 1920 నా మనసు నుంచి వచ్చిన చిత్రం. ఇదొక ఎమోషనల్ స్టొరీ. హారర్ లో ఎమోషన్ ప్రయత్నించడం ఇదే తొలిసారి. ఖచ్చితంగా ఇది అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది అన్నారు. సంజయ్, దిలీప్ సోనీ తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News