హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని ఏఏఏ సినిమాస్ ను అగ్ర హీరో అల్లు అర్జున్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఏషియన్ సినిమాస్‌తో కలసి అల్లు అర్జున్ ఈ మల్టీఫ్లెక్స్‌లో భాగస్వామిగా ఉన్నారు. ఈ సందర్భంగా నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ ఈ కాంప్లెక్స్ నాలుగో అంతస్తులో ఐదు స్క్రీన్లు ఉన్నాయి. స్క్రీన్ నెం.2లో ఎల్ఈడీ స్క్రీన్ ఉంటుంది. దక్షిణాదిలో ఎల్ఈడీ స్క్రీన్ ఉన్న ఒకే ఒక్క థియేటర్ ఇది. ప్రేక్షకులకు సరికొత్త వీక్షనానుభూతినందిస్తుంది. ఇక అతిపెద్ద తెరతో స్క్రీన్-1ను రూపొందించాం అని అన్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఈ థియేటర్ల సముదాయాన్ని తీర్చిదిద్దారని అల్లు అరవింద్ పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో నిర్మాత అల్లు అరవింద్, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ తదితరులు పాల్గొన్నారు.

















