కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా రత్నంకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం రూల్స్ రంజన్. నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్నది. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. దివ్యాంగ్ లవానియా, మురళీకృష్ణ నిర్మాతలు. ఈ సినిమాలోని పాటలకు చక్కటి ఆదరణ లభిస్తున్నది. ఈ చిత్రంలోని నాలుగో గీతం దేఖో ముంబయి ని మాస్ మహారాజా రవితేజ విడుదల చేశారు. ముంబయి నగరం గురించి పరిచయం చేస్తూ ఈ పాట ఆసక్తిని పంచింది. అద్నాన్ సమీ, పాయల్దేవ్ ఈ పాటను ఆలపించారు. పూర్తి స్థాయి వినోదభరితంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని నిర్మాతలు పేర్కొన్నారు. అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: దులీప్ కుమార్, సంగీతం: అమ్రిష్ గణేష్.














