Skip to main content

Namaste NRI

మాస్ మహారాజా చేతుల మీదుగా దేఖో ముంబై

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా రత్నంకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం రూల్స్‌ రంజన్‌. నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్నది. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. దివ్యాంగ్‌ లవానియా, మురళీకృష్ణ నిర్మాతలు. ఈ సినిమాలోని పాటలకు చక్కటి ఆదరణ లభిస్తున్నది. ఈ చిత్రంలోని నాలుగో గీతం దేఖో ముంబయి ని మాస్ మహారాజా రవితేజ విడుదల చేశారు. ముంబయి నగరం గురించి పరిచయం చేస్తూ ఈ పాట ఆసక్తిని పంచింది. అద్నాన్‌ సమీ, పాయల్‌దేవ్‌ ఈ పాటను ఆలపించారు. పూర్తి స్థాయి వినోదభరితంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని నిర్మాతలు పేర్కొన్నారు. అక్టోబర్‌ 6న ప్రేక్షకుల ముందుకురానుంది.  ఈ చిత్రానికి కెమెరా: దులీప్‌ కుమార్‌, సంగీతం: అమ్రిష్‌ గణేష్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events