బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ సంస్థ తెరకెక్కించిన చిత్రం భగవంత్ కేసరి. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఓ దర్శకుడిగా భగవంత్ కేసరి చిత్రం నాకు పూర్తి సంతృప్తి నిచ్చింది. విడుదలైన అన్ని కేంద్రాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తున్నది అన్నారు. ఈ సినిమాలోని తండ్రీ కూతురు ఎమోషన్‌కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఆడపిల్లను సింహంలా పెంచాలనే సందేశం ప్రేక్షకుల్లోకి బాగా వెళ్లింది. బాలకృష్ణగారు తన కంఫర్ట్‌జోన్ దాటి మహిళా సాధికారత కలిగిన గొప్ప కథలో నటించారు. శ్రీలీల విజ్జీ పాపగా అద్భుతంగా నటించింది.
బాలకృష్ణతో కలిసి త్వరలో పెద్ద ఈవెంట్‌ను నిర్వహించబోతున్నాం. ఈ సినిమా ప్రమోషన్లో చెప్పిన్నట్లు ఈ సినిమా శానా యేండ్లు యాదుంటాది అన్నారు. ప్రతీ కేంద్రంలో హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో ప్రదర్శింపబడుతు న్నదని నిర్మాత సాహు గారపాటి తెలిపారు. ఈ సినిమాతో నటిగా తనను చూసే విధానం మారిందని, గొప్ప పాత్రను పోషించే అవకాశం దక్కిందని శ్రీలీల ఆనందం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో గీత రచయితలు అనంత్ శ్రీరామ్, రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు.














