Skip to main content

Namaste NRI

తమ పార్టీ అధికారంలోకి వస్తే.. భారత్‌తో

కెనడాలోని కన్జర్వేటివ్ పార్టీ నేత పియరీ పొయిలీవ్రే భారత్‌తో దౌత్యపరమైన వివాదంపై ప్రధాని జస్టిన్ ట్రూడోపై విమర్శలు గుప్పించారు. నమస్తే రేడియో టొరెంటో’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ట్రూడో నవ్వులపాలయ్యారన్నారు. 2025లో కెనడాలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ప్రధాని పదవి రేసులో బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం నిర్వహించిన ఒపీనియన్‌ పోల్స్‌లో కన్జర్వేటివ్‌ పార్టీ ముందున్నది.

ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే భారత్‌తో వృత్తిపరమైన సంబంధాలను పెంచుకుంటామన్నారు. విదేశాలతో సంబంధాలను చెడగొట్టారని ఆరోపించారు. ప్రపంచంలోనే ప్రధాన శక్తులతో పెద్ద వివాదాల్లో ఉన్నామని, ఇందులో భారత్‌ కూడా ఉందన్నారు. భారత్‌తో కెనడాకు వృత్తిపరమైన సంబంధాలు అవసరమని, తాను ప్రధాని అయ్యాక సంబంధాలను పునరుద్ధరిస్తామన్నారు.

Social Share Spread Message

Latest News