గాజాపై భూతల దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతుండగా, ఇజ్రాయెల్-హమాస్ వార్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం నేపధ్యంలో ఆ ప్రాంతంలో భద్రతా పరిస్ధితులు క్షీణించడం, పెద్దసంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. తాము వెన్నంటి ఉన్నామనే భరోసా ఇచ్చిన జో బైడెన్ ఇజ్రాయెల్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు. యుద్ధ వ్యూహాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఇజ్రాయెల్‌ను కోరారు.














