Skip to main content

Namaste NRI

భారత్‌ సహా మరో ఆరు దేశాల ఉచితంగా వీసా

ఇక నుంచి భారత్‌, మరో ఆరు దేశాల వారు వీసాలకు ఎలాంటి రుసుం చెల్లించనవసరం లేకుండా శ్రీలంక టూరిస్టు వీసాలను ఉచితంగా పొందవచ్చు. భారత్‌ సహా చైనా, రష్యా, మలేషియా, జపాన్‌, ఇండోనేషియా, థాయిలాండ్‌కు చెందిన టూరిస్టులకు ఉచితంగా వీసాను మంజూరు చేస్తామని ఆ దేశ విదేశాంగ మంత్రి అలీప సాబ్రీ తెలిపారు.  తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని, దీన్ని వచ్చే ఏడాది మార్చి 31 వరకు పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టనున్నట్టు ఆయన చెప్పారు. రుణ ఊబిలో చిక్కుకున్న శ్రీలంకలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

Social Share Spread Message

Latest News