Skip to main content

Namaste NRI

మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ  

 మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ తన సన్నిహిత మిత్రుడు అమితాబ్‌ బచ్చన్‌తో కలసి నటిస్తున్నారు రజనీకాంత్‌.  తమిళనాట సూపర్‌స్టార్‌గా ఉండికూడా బాలీవుడ్‌లో అమితాబ్‌తో కొన్ని సినిమాలు చేశారు రజనీ. మళ్లీ దాదాపు 33 ఏళ్ల  సుదీర్ఘ విరామం తర్వాత అమితాబ్‌తో ఆయన నటించబోతున్నాడు. టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందనున్న తన 170వ చిత్రంలో వీరిద్దరూ తెరను పంచుకోబోతున్నారు. ఈ విషయంపై సూపర్‌స్టార్‌ ఎక్స్‌(ట్విటర్‌) ద్వారా ఆనందాన్ని పంచుకున్నారు. 33ఏళ్ల తర్వాత నా గురువు, మార్గదర్శకుడు, దిగ్రేట్‌ అమితాబ్‌గారితో నటించబోతున్నాను. నా గుండె ఆనందంతో కొట్టుకుంటుంది  అంటూ ట్వీట్‌ చేశారు తలైవా. భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు లెజండరీ హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూడడం నిజంగా అభిమానులకు ఆనందమే! అమితాబ్‌, రజనీకాంత్‌ ఇంతకుముందు అంథా కానూన్‌, గిరాఫ్తార్‌ వంటి చిత్రాల్లో నటించారు.

Social Share Spread Message

Latest News