Skip to main content

Namaste NRI

డిట్రాయిట్ షిర్డీ సాయిబాబా ఆలయంలో ఎన్నారైలు ..ప్రత్యేక పూజలు

డిట్రాయిట్ లో ని షిర్డీ సాయిబాబా ఆలయంలో  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బెయిలుపై విడుదలైన సందర్భంగా   ప్రవాస ఆంధ్రులు, ఎన్నారై టీడీపీ, జనసేన కార్యకర్తలు పవిత్ర గురువారం రోజు వేద పండితులతో అత్యంత నిష్ఠతో చంద్రబాబు గారి గోత్ర నామాల మీద అభిషేకం మరియు అర్చన చేయించారు. చంద్రబాబు కు ఆయురారోగ్యాలు సిద్ధించి తిరిగి అతి త్వరలో ప్రజా సేవలో పాల్గొంటారని వేద పండితులు దీవించారు.చంద్రబాబు నాయుడు పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని, తిరిగి రాష్ట్ర ప్రగతి కోసం ముఖ్యమంత్రి గా పాలనా నాయకత్వం వహించాలని, న్యాయస్థానాలు వేదికగా ఆయన చేస్తున్న ధర్మ పోరాటానికి దైవానుగ్రహం తోడవ్వాలని వేడుకొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సురేష్ పుట్టగుంట, నిరంజన్ శృంగవరపు, శ్రీనివాస గోగినేని, సునీల్ పాంత్రా, విష్ణు జంపాల తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News