Skip to main content

Namaste NRI

కాలింగ్‌ సహస్ర నుంచి కనుల నీరు రాలదే

సుడిగాలి సుధీర్‌ హీరోగా రూపొందుతోన్న చిత్రం కాలింగ్‌ సహస్ర. డాలీషా కథానాయిక. అరున్‌ విక్కిరాలా దర్శకుడు. విజేష్‌ తయాల్‌, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మాతలు. ఈ సదర్భంగా ఈ చిత్రంలోని కనుల నీరు రాలదే అంటూ సాగే గీతాన్ని మేకర్స్‌ విడుదల చేశారు. మోహిత్‌ స్వరపరిచిన ఈ గీతాన్ని సుద్దాల అశోక్‌తేజ రచించారు. ఈ సినిమాతో సుధీర్‌ తప్పకుండా పెద్ద హీరో స్థాయికి ఎదుగుతాడని, సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంటుందని, రాజీపడకుండా సహకరించిన నిర్మాతలకు కృతజ్ఞతలని దర్శకుడు చెప్పారు. సినిమా అద్భుతంగా వచ్చిందని, భారీగా విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నామని బెక్కెం వేణుగోపాల్‌ తెలిపారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News