Skip to main content

Namaste NRI

సప్తసాగరాలు దాటి సైడ్‌ బి మెప్పిస్తుంది: రక్షిత్‌శెట్టి

రక్షిత్‌శెట్టి  కథానాయకుడిగా నటించిన చిత్రం సప్తసాగరాలు దాటి సైడ్‌ బి. రుక్మిణీ వసంత్‌, చైత్ర జె ఆచార్‌ నాయికలు.  పీపుల్‌ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రానికి హేమంత్‌రావు దర్శకత్వం.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రక్షిత్‌శెట్టి మాట్లాడుతూ  తెలుగు ప్రేక్షకులు నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. శ్రీమన్నారాయణ, 777 ఛార్లీ, సప్తసాగరాలు దాటి సైడ్‌ ఏ.. చిత్రాలను ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు సప్తసాగరాలు దాటి సైడ్‌ బి కూడా మిమ్మల్ని మెప్పిస్తుంది అన్నారు.  దర్శకుడు మాట్లాడుతూ రెండో భాగం చాలా భిన్నంగా ఉంటుంది. తొలిభాగానికి కొనసాగింపుగా కథ నడుస్తుంది. హృదయాన్ని స్పృశించేలా సన్నివేశాలుంటాయి అని చెప్పారు. మను, ప్రియ జంట ప్రణయగాథ మనసులను హత్తుకుంటుందని కథానాయిక రుక్మిణీ వసంత్‌ పేర్కొంది. ఈ కార్యక్రమం లో నిర్మాత వివేక్‌ కూచిభొట్ల పాల్గొన్నారు. ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News