Skip to main content

Namaste NRI

 హాంకాంగ్ వచ్చే భారతీయులకు.. ఇది  తప్పనిసరి

హాంకాంగ్  వచ్చే భారతీయ పర్యాటకులు అక్కడి ఇమిగ్రేషన్ శాఖ ప్రీ అరైవల్ రిజిస్ట్రేషన్‌ను  తప్పనిసరి చేసింది. ప్రయాణ తేదీకి ముందే ఆన్‌లైన్‌లో ఈ ముందస్తు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించింది. అయితే, హాంకాంగ్ మీదుగా వెళ్లేవాళ్లు ఎయిర్‌పోర్టు వీడని సందర్భాల్లో ఈ రిజిస్ట్రేషన్ అవసరం లేదని పేర్కొంది.   రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక పర్యాటకులు తమకు కేటాయించిన కంప్యూటర్ జనరేటెడ్ స్లిప్‌ను ఏ4 సైజు పేపర్‌పై ప్రింటు తీసుకోవాలి. విమానం ఎక్కే సమయంలో ఈ స్లిప్‌ను చెక్ ఇన్ కౌంటర్‌లో చూపించాలి. స్లిప్‌లోని వివరాలు ప్రయాణికుల పాస్‌పోర్టు వివరాలకు భిన్నంగా ఉంటే విమానం ఎక్కనీయరని అధికారులు చెబుతున్నారు. హాంకాంగ్‌లో దిగాక కూడా అదే పాస్‌పోర్టు చూపించాలని ఇమిగ్రేషన్ శాఖ తెలిపింది. వివరాల్లో తేడాలు ఉన్న పక్షంలో దేశంలోకి ప్రవేశించేందుకు అనుమతి లభించదని కూడా స్పష్టం చేసింది.

Social Share Spread Message

Latest News