Namaste NRI

పుతిన్‌కు ర‌హ‌స్య నివాసం… ఎక్కడో తెలుసా?

ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు, ఫిన్‌ల్యాండ్ బోర్డ‌ర్ వ‌ద్ద ర‌హ‌స్య నివాసం ఉన్న‌ట్లు తెలుస్తోంది. డొసైర్ సెంట‌ర్ ఇచ్చిన ద‌ర్యాప్తు నివేదిక ఆధారంగా ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. క‌రేలియాలోని లేక్ ల‌డోగా నేష‌నల్ పార్క్‌లో పుతిన్ ర‌హ‌స్య స్థావ‌రం ఉన్న‌ట్లు భావిస్తున్నారు. ఆ నిగూఢ స్థావ‌రానికి చెందిన వీడియో కూడా ఒక‌టి రిలీజైంది. పుతిన్ సీక్రెట్ కంట్రీ హౌజ్ అని ఆ ల‌గ్జ‌రీ ఎస్టేట్‌కు చెందిన వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేశారు.  మార్జ‌ల‌హ‌తి బే వ‌ద్ద ఉన్న ఆ బిల్డింగ్‌ను చాలా మాడ్ర‌న్ స్ట‌యిల్‌లో నిర్మించారు. ఆ ఇంటి వ‌ద్ద రెండు హెలీప్యాడ్‌లు ఉన్నాయి. బోటింగ్ కోసం ఏర్పాట్లు కూడా చేశారు. బీఫ్ ప్రొడ‌క్ష‌న్ కోసం ఫార్మ్ ను కూడా క‌ట్టారు. ఇంటీరియ‌ల్ డెక‌రేష‌న్ కోసం అత్యంత ఖ‌రీదైన రాళ్ల‌ను వాడిన‌ట్లు తెలుస్తోంది. పుతిన్ ఇంటి ముందు ఓ జ‌ల‌ పాతం కూడా ఉన్న‌ట్లు రిపోర్టులో తెలిపారు. యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్ట‌మ్‌తో నిర్మించిన ఓ ప్ర‌దేశం కూడా ఉన్న‌ది.  అధ్య‌క్షుడు పుతిన్ సేద‌తీరే స్థాయికి త‌గిన‌ట్లు ర‌హ‌స్య ఇంటిని నిర్మించిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. ఇక ఇక్క‌డ సెక్యూర్టీ కోసం ఫెడ‌ర‌ల్ గార్డ్ స‌ర్వీస్‌ను వాడ‌నున్నారు. స‌మీపంలో ఉన్న దీవుల‌తో లింక్‌ను తెంచేశారు. అన్ని ఎంట్రెన్సుల‌ను బ్లాక్ చేశారు. ఈ బిల్డింగ్ వ‌ద్ద రావాలంటే కేవ‌లం బోటు లేదా విమానంలో మాత్ర‌మే వీలు అవుతుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events