Skip to main content

Namaste NRI

అమెరికా గుడ్‌న్యూస్‌… అందుబాటులోకి పైలట్‌ వీసా ప్రోగ్రాం

ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లే వారికి వీసా రెన్యువల్‌ విషయంలో ఎదురయ్యే కష్టాలు ఇకపై తప్పనున్నాయి. హెచ్‌-1బీ వీసా రెన్యువల్‌ విధానాన్ని మరింత సరళీకరిస్తూ అమెరికా తీసుకొన్న నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఈ నెల 29 నుంచి ఈ ప్రోగ్రామ్‌ ప్రారంభమైందని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. దీంతో భారత్‌ సహా ఇతర దేశాలకు చెందిన వృత్తి నిపుణులు ఇకపై అమెరికాలో తమ గడువు తీరిన వీసాలను అక్కడే రెన్యువల్‌ చేసుకోవచ్చు. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా 20 వేల వీసాలను అమెరికాలోనే రెన్యువల్‌ చేయనున్నారు. తొలి దశ డ్రైవ్‌లో ఈ అవకాశాన్ని కేవలం భారతీయులు, కెనడియన్లకు మాత్రమే కల్పించారు. ఐదు వారాలు కొనసాగే ఈ వీసా రెన్యువల్‌ కార్యక్రమంలో ప్రతి వారం 4 వేలు చొప్పున వీసాలను ఇమ్మిగ్రేషన్‌ అధికారులు రెన్యువల్‌ చేయనున్నారు. 2021, ఫిబ్రవరి 1 నుంచి 2021, సెప్టెంబర్‌ 30 మధ్య మిషన్‌ ఇండియా జారీ చేసిన వీసాలను మాత్రమే రెన్యువల్‌ చేసుకొనేందుకు వీలు కల్పించారు.

Social Share Spread Message

Latest News