Skip to main content

Namaste NRI

హీరో  శ్రీకాంత్ చేతుల మీదుగా రాధా మాధవం ట్రైలర్ రిలీజ్

వినాయక్‌ దేశాయ్‌, అపర్ణాదేవి జంటగా నటించిన చిత్రం రాధా మాధవం. దాసరి ఇస్సాకు దర్శకత్వం. గోనాల వెంకటేష్‌ నిర్మాత. మేక రామకృష్ణ, జయప్రకాష్‌, ప్రియ, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదలకానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్‌ ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భం గా శ్రీకాంత్ మాట్లాడుతూ  ట్రైల‌ర్ బాగుంద‌ని మంచి పల్లెటూరి ప్రేమకథ చూడబోతున్నామని ఫీలింగ్ కలిగిం చిందని వెల్ల‌డించారు. ఇక ఈ మూవీ మంచి హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్న‌ట్లు చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథా చిత్రమిది. ప్రేమ జంట ప్రయాణానికి దృశ్య రూపంలా నిలుస్తుంది. కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయి అన్నారు.  ఈ నెలలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: తాజ్‌ జీడీకే, సంగీతం: చైతు కొల్లి, కథ, మాటలు, పాటలు: వసంత్‌ వెంకట్‌ బాలా, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దాసరి ఇస్సాకు.

Social Share Spread Message

Latest News