Namaste NRI

రవితేజతో మూవీ చేయడం నా అదృష్టం

రవితేజ హీరోగా నటించిన తాజా  చిత్రం ఈగల్‌.  కావ్య థాపర్‌  కథానాయిక. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించింది కావ్య థాపర్‌. ఇందులో నా పేరు రచన. యూనిక్‌ గోల్స్‌ వున్న అమ్మాయిని. ఈ సినిమాలో అంతర్లీనంగా అద్భుతమైన ప్రేమకథ కూడా ఉంటుంది. దాని గురించి ఇప్పుడు రివీల్‌ చేయలేను. ఈ సినిమాలో యాక్షన్‌ ఎంత కొత్తగా ఉంటుందో, రొమాన్స్‌ కూడా అంత కొత్తగా ఉంటుంది. హీరోహీరోయిన్ల పాత్రల మధ్య కెమిస్ట్రీ యూనిక్‌గా ఉంటుంది  అని అన్నారు.

 ఓ బాలీవుడ్‌ సినిమా షూటింగ్‌ కోసం ముంబైలో ఉన్న సమయంలో ఈ సినిమా దర్శకుడు కార్తీక్‌ ఈ కథ చెప్పారు. చాలా కొత్తగా అనిపించింది. ముఖ్యంగా రవితేజగారి సినిమాలో చేయడం గొప్ప అవకాశం. అందుకే వెంటనే ఓకే అనేశాను. నేను ఓకే అన్నాకూడా లుక్‌ టెస్ట్‌ చేసిన తర్వాతే నన్ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. లొకేషన్‌లో రవితేజ అభిమానిని అయిపోయాను. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. పాజిటీవ్‌ ఎనర్జీతో ఎప్పుడూ సరదాగా ఉంటారు. ఆయన వల్ల షూటింగ్‌ సరదాగా గడిచిపోయింది అని కావ్య థాపర్‌ చెప్పారు. పోలాండ్‌, లండన్‌ ఇలా అద్భుతమైన లొకేషన్స్‌లో ఇంటర్నేషనల్‌ స్థాయిలో చిత్రీకరణ జరిపారని, షూటింగ్‌ ఓ వెకేషన్‌ లాగే సాగిపోయిందని, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో మరిన్ని సినిమాలు చేయాలనుందని కావ్య ఆశాభావం వ్యక్తం చేసింది.

Social Share Spread Message

Latest News