Skip to main content

Namaste NRI

వైద్య చరిత్రలో ఇదో మిరాకిల్‌… కోమా నుంచి బయటకు!

వైద్య చరిత్రలో ఇదో మిరాకిల్‌. అసాధ్యం అనుకున్నవి సాధ్యమైనప్పుడు వైద్యులు వాడే పదాలివి. సరిగ్గా ఇలాంటి అద్భుతమే జరిగింది అమెరికాలో. రోడ్డు ప్రమాదంలో ఐదేండ్ల క్రితం కోమాలోకి వెళ్లిన ఓ మహిళ ఇటీవల తన తల్లి జోక్‌తో నవ్వింది. కోమా నుంచి బయటకు వచ్చింది. క్రమంగా కోలుకుంటున్నది. అమెరికా లోని మిషిగాన్‌కు చెందిన ఫ్లెవెల్లెన్‌ జెన్నిఫర్‌ 2017 సెప్టెంబర్‌లో జరిగిన ఓ కారు ప్రమాదంతో కోమాలోకి వెళ్లింది. నాటి నుంచి ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 41 ఏండ్ల జన్నిఫర్‌ మెదడు నిద్రాణా వ్యవస్థ లోకి వెళ్లిపోయింది. కొద్ది రోజుల క్రితం తన తల్లి పెగ్గి మీన్స్‌ చెప్పిన జోక్‌కు నవ్వుతూ కోమా నుంచి బయట పడింది. జెన్నిఫర్‌ ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నది. తన కుమారుడి ఫుట్‌మ్యాచ్‌లు కూడా చూస్తున్నది. 1-2 శాతం పేషెంట్లు సుదీర్ఘ కోమా నుంచి బయటపడి పూర్తిగా కోలుకొనే అవకాశాలు ఉన్నట్టు వైద్య నిఫుణులు తెలిపారు.

Social Share Spread Message

Latest News