Namaste NRI

పుల్వామా అమరవీరులకు నివాళులర్పించిన .. ఆపరేషన్ వాలెంటైన్ టీం

ఆపరేషన్‌ వాలెంటైన్‌ చిత్ర బృందం పుల్వామా స్మారక ప్రదేశాన్ని సందర్శించింది. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేష నల్‌, రినైసన్స్‌ పతాకాలపై సందీప్‌ ముద్దా ఈ చిత్రాన్ని నిర్మించారు. శక్తి ప్రతాప్‌ హడా ఈ చిత్రానికి దర్శక త్వం వహించారు.  ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్లకు హీరో వరుణ్‌తేజ్‌, కథానాయిక మానుషి చిల్లర్‌ తో పాటు చిత్రబృందం నివాళులర్పించింది. భారత వైమానిక దళ ధైర్య సాహసాలు, త్యాగాలను ఆవిష్కరిస్తూ యథార్థ సంఘటనల ఆధారంగా ఆపరేషన్‌ వాలెంటైన్‌ చిత్రా న్ని తెరకెక్కించారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్‌ కంటెంట్‌కు మంచి స్పందన లభిస్తున్నదని, పాటలు ప్రేక్షకులకు చేరువయ్యాయని, ప్రజల్లో దేశభక్తి భావాలను పెంపొందించే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events