Namaste NRI

పుతిన్‌ కీలక ప్రకటన … త్వరలో అందుబాటులోకి

ప్రపంచవ్యాప్తంగా చిన్నాపెద్దా అందరినీ కబళిస్తున్న క్యాన్సర్‌కు అడ్డకట్ట వేసే టీకా వచ్చేస్తున్నది. ఈ విషయంలో రష్యా శాస్త్రవేత్తలు దాదాపు విజయం సాధించారు. ఈ మేరకు ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కీలక ప్రకటన చేశారు. క్యాన్సర్‌ టీకా తయారీలో తమ శాస్త్రవేత్తలు దాదాపు తుది దశలో ఉన్నట్టు వెల్లడించా రు.  క్యాన్సర్‌ టీకాతో పాటు దాని చికిత్సలో ఉపయోగించే ఇమ్యునోమాడ్యులేటరీ డ్రగ్స్‌ తయారీలో శాస్త్రవేత్త లు తలమునకలై ఉన్నట్టు పేర్కొన్నారు. త్వరలోనే అవి వ్యక్తిగత చికిత్సా పద్ధతులుగా సమర్థంగా ఉపయో గపడతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. అయితే, ఈ వ్యాక్సిన్‌ ఏ క్యాన్సర్‌ను లక్ష్యంగా చేసుకుని అభివృద్ధి చేస్తున్నదీ బయటపెట్టలేదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events