Skip to main content

Namaste NRI

చైతన్య రావు పారిజాత పర్వం నుంచి నింగి నుంచి జారే పాట విడుదల

చైతన్యరావు, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రల్లో సంతోష్‌ కంభంపాటి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం పారిజాత పర్వం. మహీధర్‌ రెడ్డి, దేవేష్‌ నిర్మాతలు. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. వైవా హర్ష, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సురేఖవాణి, సమీర్‌, గుండు సుదర్శన్‌, జబర్దస్త్‌ అప్పారావు తదితరులు నటిస్తున్నారు.   ఈ సినిమాలోని నింగి నుంచి జారే అనే పాటను విడుదల చేశారు. రీ స్వరపరచిన ఈ పాటను కిట్టు విస్సాప్రగడ రచించారు. హరిచరణ్‌, లిప్సిక ఆలపించారు. ఈ పాటలో నాయకానాయికల కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. ఇటీవలే విడుదలైన కాన్సెప్ట్‌, ఫస్ట్‌లుక్‌ టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నదని, వినోదాత్మక చిత్రంగా మెప్పిస్తుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: బాల సరస్వతి, నిర్మాణ సంస్థ: వనమాలి క్రియేషన్స్‌, రచన-దర్శకత్వం: సంతోష్‌ కంభంపాటి.

Social Share Spread Message

Latest News