Skip to main content

Namaste NRI

చరణ్‌కు జోడీగా జాన్వీకపూర్‌ 

జాన్వీకపూర్‌కు  తెలుగులో మరో బంపరాఫర్‌ను సొంతం చేసుకుంది. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా బుచ్చి బాబు దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఆర్‌సీ16 వర్కింగ్ టైటిల్‌గా వ‌స్తున్న ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ కలసి ఈ ప్రాజెక్టును నిర్మించనున్నాయి.  గ్రామీణ నేపథ్య స్పోర్ట్స్‌ డ్రామా కథాంశమిది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక జరుగుతున్నది.  ఈ చిత్రంలో కథానాయికగా జాన్వీకపూర్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి బోనీ కపూర్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మరికొద్ది రోజుల్లో జాన్వీకపూర్‌ రామ్‌చరణ్‌ షూటింగ్‌లో జాయిన్‌ అవుతుందని, తెలుగులో తన కుమార్తెకు మరో మంచి అవకాశమిదని బోనీకపూర్‌ ఆనందం వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News