Skip to main content

Namaste NRI

 ఆస్ట్రేలియా కొత్త వీసా విధానం

ఆస్ట్రేలియా కొత్త వీసా విధానం భారతీయులపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. తిరస్కరణకు గురవుతున్న భారతీయ విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య  ఇటీవల కాలంలో పెరిగింది. ప్రభుత్వం జరిమానాలకు జంకుతు న్న అనేక యూనివర్సిటీలు అడ్మిషన్ ఆఫర్ లెటర్లను ఉపసంహరించుకుంటున్నాయి. గతేడాది చివరి రెండు త్రైమాసికాల్లో ప్రతి ఐదు అంతర్జాతీయ దరఖాస్తుల్లో ఒకటి తిరస్కరణకు గురైనట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కొత్త వీసా నిబంధనల కారణంగా ఈ ఏడాది ఆస్ట్రేలియాలో కొత్తగా 3,75,000 విదేశీ విద్యార్థు లకే అనుమతులు దక్కుతాయి. వచ్చే ఏడాది ఈ సంఖ్య ఏకంగా 2,50,000కు తగ్గవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో దక్షిణాసియా దేశాల వారిలో సంఖ్యాపరంగా భారతీయ విద్యార్థులు ముందు వరుసలో ఉండగా ఆ తరువాతి స్థానాల్లో పాకిస్థాన్ నేపాల్ దేశస్తులు ఉన్నారు.

Social Share Spread Message

Latest News