Skip to main content

Namaste NRI

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు.. చివరి దశలో కలియుగం పట్టణం

విశ్వకార్తిక్‌, ఆయూషి పటేల్‌ జంటగా నటిస్తున్న చిత్రం కలియుగం పట్టణం. రమాకాంత్‌ రెడ్డి దర్శకుడు. కందుల చంద్ర ఓబుల్‌ రెడ్డి నిర్మాత. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఇప్పటివరకు ఈ తరహా కాన్సెప్ట్‌ తెలుగులో రాలేదు. కడప జిల్లాలో 45 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాం. అంతర్లీనంగా చక్కటి సందేశంతో యువత, ఫ్యామిలీ ఆడియెన్స్‌ మెచ్చేలా ఈ సినిమాను తీర్చిదిద్దాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి అన్నారు. మార్చి 22న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: చరణ్‌ మాధవనేని, సంగీతం: అజయ్‌ అరసాడ, నిర్మాతలు: డాక్టర్‌ కె చంద్ర ఓబుల్‌ రెడ్డి, జి.మహేశ్వర్‌ రెడ్డి, కాటం రమేష్‌, సాహిత్యం: చంద్రబోస్‌, భాస్కరభట్ల, దర్శకుడు: రమాకాంత్‌ రెడ్డి.

Social Share Spread Message

Latest News