Namaste NRI

అధ్యక్ష ఎన్నికల రేసులో.. మరో రామస్వామి

అమెరికాలో జరుగనున్న ఎన్నికల్లో మరో రామస్వామి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. భారత సంతతికి చెందిన అశ్విన్‌ రామస్వామి (24) జార్జియా సెనేట్‌ స్థానానికి పోటీ చేస్తున్నారు. తద్వారా ఆ స్థానానికి పోటీ చేస్తున్న తొలి జనరేషన్‌-జడ్‌ (1997-2012 మధ్య జన్మించినవారు) ఇండో-అమెరికన్‌గా నిలిచారు. అశ్విన్‌ రామస్వామి తల్లిదండ్రులు 1990లో తమిళనాడు నుంచి అమెరికాకు వలస వెళ్లారు. జార్జియా రాష్ర్టానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో అధికార డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ఆ రాష్ట్రంలోని డిస్ట్రిక్ట్‌ 48 స్టేట్‌ సెనేట్‌ కోసం పోటీ చేస్తున్నట్టు అశ్విన్‌ రామస్వామి వెల్లడించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events