Skip to main content

Namaste NRI

ఇదొక స్పై యాక్షన్‌ కామెడీ జానర్‌ : కీర్తి కుమార్‌

వెన్నెల కిశోర్‌ హీరోగా రూపొందిన చిత్రం చారి 111. సంయుక్త విశ్వనాథన్‌ కథానాయిక. మురళీశర్మ ప్రధాన పాత్ర పోషించారు. టీజీ కీర్తికుమార్‌ దర్శకుడు. అదితి సోని నిర్మాత. ఈ సందర్భంగా చిత్రబృందం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. దర్శకుడు మాట్లాడుతూ   వెన్నెల కిశోర్‌కి టైలర్‌మేడ్‌ క్యారెక్టర్‌ ఇది. ఇదొక స్పై యాక్షన్‌ కామెడీ జానర్‌. కమర్షియల్‌ సినిమాలకు ఏ మాత్రం తక్కువగా ఉండదు. సాంకేతికంగా కూడా నెక్ట్స్‌ లెవల్లో ఉంటుందీ సినిమా అని చెప్పారు. వెన్నెలకిశోర్‌ అభిమానినైన నేను ఆయన హీరోగా సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందని, మే1న సినిమా విడుదల కానుందని నిర్మాత తెలిపారు. మూడు నెలలు సమయం తీసుకుని ఇందులో పాట రాశానని, సైమన్‌ కె.కింగ్‌ తెలుగువాడు కాకపోయినా చక్కగా అర్థవంతంగా పాటను స్వరపరిచారని గీత రచయిత రామజోగయ్యశాస్త్రి అన్నారు. సినిమాలో అవకాశం ఇచ్చినందుకు కథానాయిక సంయుక్త విశ్వనాథన్‌ ఆనందం వెలిబుచ్చారు. ఇంకా సంగీత దర్శకుడు సైమన్‌ కె.సింగ్‌ కూడా మాట్లాడారు. మార్చి 1న ఈ సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News