Skip to main content

Namaste NRI

రజనీకాంత్‌ కొత్త చిత్రం

జైలర్‌ చిత్రంతో గత ఏడాది భారీ విజయాన్ని దక్కించుకున్నారు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. తాజాగా ఆయన లైనప్‌లోకి మరో భారీ సినిమా చేరింది. బాలీవుడ్‌లో ఎన్నో కమర్షియల్‌ హిట్‌ సినిమాలతో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు సాజిద్‌ నదియావాలా. ఆయన త్వరలో రజనీకాంత్‌తో భారీ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నా రు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలియజేస్తూ రజనీకాంత్‌తో దిగిన ఫోటోను షేర్‌ చేశారు. రజనీ కాంత్‌ వంటి లెజెండ్‌తో సినిమా చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. మా ప్రయాణం మరచిపోలేని విధంగా ఉండాలని కోరుకుంటున్నా అని సాజిద్‌ నదియావాలా పేర్కొన్నారు. ఈ సినిమాకు సంబంధించిన దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

Social Share Spread Message

Latest News